చినుకు వరుణుని వాకిటన్ ప్రగతికి బాటయై జలధారగా వచ్చు సతము 'చినుకు' 'వాన' - రా- రమ్మను పరవశత్వము జూపు బాల బాలికలలకు వరము 'చినుకు' బీటలు వారిన తోటలన్ రైతుల తొలకరి జల్లుగా పిలుచు 'చినుకు' చిన్కు చిన్కుల మధ్య చిత్రమై గుఱ్ఱాల తోలెడు నకులుని దూత 'చినుకు' గ్రీష్మ తాపమ్మునడయించు క్షితిని 'చినుకు' గొడుగు మడతల తెరిపించు వడిగ 'చినుకు' నేల బురదగ మార్చును లీల 'చినుకు' చినుకు చినుకున జగతి భాసించు నిజము! -- బి. వి. వి. హెచ్. బి. ప్రసాద రావు, గుంటూరు సెల్: 984 995 8069
Posts
Showing posts from February, 2019