శ్రీకృష్ణదేవరాయలు
శ్రీకృష్ణదేవరాయలు
కలము పట్టిన చాలు కదనుఁద్రొక్కునుఁగదా
కమనీయ సత్కావ్య కళల శోభ
కరవాలమునుఁబట్ట కంపితులగుఁగదా
శాత్రవుల్ మీదగు క్షాత్రముఁగని
తెలుగు భాషాయోష తేజరిల్లెనుఁగదా
మురిపాల కావ్యాలు మురిసి దొరల
రాజ వీధులలోన రాజిల్లెనుఁగదా
రతనాల మణిమయ రాశులెల్ల
స్వర్ణ యుగమునుఁదలపించు చరిత మీది
ధర్మ దేవత నడయాడు ధరణి మీది
రసికతలు పొరలెడు మిసిమి మీది
జయము రవళించు చోటు రాజన్య మీది!
please put down your reviews as comments below!! :)
కలము పట్టిన చాలు కదనుఁద్రొక్కునుఁగదా
కమనీయ సత్కావ్య కళల శోభ
కరవాలమునుఁబట్ట కంపితులగుఁగదా
శాత్రవుల్ మీదగు క్షాత్రముఁగని
తెలుగు భాషాయోష తేజరిల్లెనుఁగదా
మురిపాల కావ్యాలు మురిసి దొరల
రాజ వీధులలోన రాజిల్లెనుఁగదా
రతనాల మణిమయ రాశులెల్ల
స్వర్ణ యుగమునుఁదలపించు చరిత మీది
ధర్మ దేవత నడయాడు ధరణి మీది
రసికతలు పొరలెడు మిసిమి మీది
జయము రవళించు చోటు రాజన్య మీది!
please put down your reviews as comments below!! :)
రాయల వైభవాన్ని రమణీయంగా వర్ణించారు అభినందనలు
ReplyDeleteకృతజ్ఞతలు
Deleteధన్యవాదములు
ReplyDeleteమీ కవితా శైలి చాలా అద్భుతం బావగారు...మనఃపూర్వక అభినందనలు ...విశ్వపతి
ReplyDeleteThank you
ReplyDelete